Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్ల్యూటీసీ ఫైనల్ గణాంకాలు : ఆ మూడు జట్ల పరిస్థితి ఏంటి?

ఠాగూర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (12:24 IST)
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ ఫైనల్ కోసం చోటుదక్కించుకునేందుకు అనేక జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ముఖ్యంగా, భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల గట్టిపోటీ నెలకొంది. తొలిసారి జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సౌతాఫ్రికా, పాకిస్థాన్ జట్లు పోటీపడ్డాయి. ఈ టైటిల్‌ను సౌతాఫ్రికా జట్టు గెలుచుకుంది. 
 
మరోవైపు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆదివారం సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌పై రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సఫారీలు ఫైనల్‌కు దూసుకెళ్లారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 66.67 పాయింట్లతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
 
అలాగే ఆస్ట్రేలియా (58.89), భారత్ (55.88) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. న్యూజిలాండ్ (48.21) నాలుగో స్థానంలో, శ్రీలంక (45.45) ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి. దీంతో దక్షిణాఫ్రికాతో ఫైనల్ ఆడే రెండో స్థానం కోసం ఆసీస్, భారత్ పోటీ పడుతున్నాయి.
 
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత్ ఒక్క మ్యాచ్ ఓడినా.. మొదటికే మోసం వస్తుంది. అందుకే ప్రస్తుతం మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టును డ్రాగా ముగించాలి. ఆ తర్వాత సిడ్నీ వేదికగా జరిగే ఐదో టెస్టులో గెలవాలి.
 
అలాగే శ్రీలంక తమ రెండు మ్యాచ్ల సిరీస్‌లో ఆస్ట్రేలియాను 0-1తో ఓడిస్తే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ బీజీటీ సిరీస్ 2-2తో ముగిస్తే, శ్రీలంకపై ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోతే భారత్ నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

తర్వాతి కథనం
Show comments