Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అమీతుమీకి సిద్ధమైన సౌతాఫ్రికా - పాకిస్థాన్ :: ఓడితే దాయాది దేశం ఇంటికే

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (11:31 IST)
భారత్ వేదికగా ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికీ సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో అగ్రశ్రేణి జట్లు తమ చెత్త ప్రదర్శనతో ఇంటిదారి పట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా - పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడితే మాత్రం సెమీస్ ఆశలు గల్లంతుకానున్నాయి. ఆ తర్వాత నామమాత్రపు మ్యాచ్‌లలో ఆడి ఇంటిదారిపట్టాల్సి వస్తుంది. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ స్పందిస్తూ, సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలిచి తీరాలన్న ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయితే, ఇలాంటి పరిస్థితి తమకు కొత్తేంకాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో ఈ పరిస్థితిని ఎదుర్కొని అద్భుత ప్రదర్శన చేశామని గుర్తుచేశారు. 
 
ఇక సౌతాఫ్రికా మ్యాచ్ విషయంలో తాము కొత్తగా కోల్పోయేదేమీ ఉండదనే ఆలోచనతోనే బరిలోకి దిగుతామన్నారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ప్రపంచ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుందనేది జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికీ తెలుసన్నారు. అందువల్ల ఈ మ్యాచ్‌లో గెలవడం తప్ప తమ ముందు మరో మార్గం లేదని చెప్పారు. అందువల్ల శుక్రవారం మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని షాదాబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments