Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్షాన్, సంగక్కర అదుర్స్: బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయం

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (12:48 IST)
తిలకరత్నే దిల్షాన్  (146 బంతుల్లో 161 నాటౌట్; 22 ఫోర్లు), సంగక్కర (76 బంతుల్లో 105 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.

బంగ్లాదేశ్ బౌలింగ్‌ను చితక్కొడుతూ సంగక్కర, దిల్షాన్ శతకాల మోత మోగించడంతో ప్రపంచకప్‌లో గురువారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 92 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది.
 
ఎంసీజీలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో వికెట్ నష్టానికి 332 పరుగులు చేసింది. ఇక బంగ్లాదేశ్ 47 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. శబ్బీర్ రెహమాన్ (62 బంతుల్లో 53; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షకీబ్ (59 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), ముష్ఫీకర్ రహీమ్ (39 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) మోస్తరుగా ఆడారు. 
 
లంక పేసర్ల ధాటికి ఓపెనర్లతో పాటు టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. దీంతో బంగ్లా 100 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. అయితే ముష్ఫీకర్... షకీబ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 64; శబ్బీర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 44 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. మలింగ 3, లక్మల్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దిల్షాన్ చెరో రెండు వికెట్లు తీశారు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments