Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషబ్ పంత్‌ చేష్టలు.. నవ్వుకున్న జనం.. కోహ్లీ ప్రశంసలు.. (video)

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (14:10 IST)
టీమిండియా యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ మైదానంలోకి ఎంటరైతే అందరి కళ్లూ అతనిపై పడేలా చేస్తాడు. తాజాగా అహ్మదాబాద్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 
 
ఈ సంఘటన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ యొక్క ఏడవ ఓవర్‌లో జరిగింది. కామెంట్రీ బాక్స్‌లో కూర్చున్న మాజీ ఫాస్ట్ బౌలర్లు అజిత్ అగర్కర్, డీప్ దాస్‌గుప్తా కూడా జింనాస్ట్ లాగా పంత్ నిలబడటం చూసి నవ్వడం మొదలు పెట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ టెస్ట్ మొదటి రోజు, పంత్ వికెట్ వెనుక చాలా చురుకుగా కనిపించాడు. తనదైన శైలిలో, అతను బౌలర్లను ప్రోత్సహించాడు. ఇంతలో ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ బంతిని క్యాచ్ చేసే ప్రయత్నంలో పడిపోయాడు.
 
ఇషాంత్ బౌలింగ్ వేస్తున్న సమయంలో బ్యాట్స్‌మన్‌కి చాలా దగ్గరగా వేశాడు. కాని పంత్ మాత్రం ఆ బంతిని చాలా కష్టపడి పైకి ఎగిరి అందుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో బంతిని పట్టుకోవటానికి పంత్ చాలా కష్టపడాల్సి వచ్చింది. 
 
చివరకు బంతిని పట్టుకునేటప్పుడు పంత్ పడిపోవల్సి వచ్చింది. కానీ కింద పడిపోయిన తరువాత, అతను యథావిధిగా నిలబడలేదు… దూకి జిమ్నాస్ట్ లాగా పల్టీలు కొట్టాడు. ఇక్కడ పంత్ ఫిట్నెస్ కనిపించింది. 
 
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రిషబ్ దూకి నిలబడటం చూసి షాకయ్యాడు. అతను చేతి సంజ్ఞలు చేస్తూ.. కళ్ళతో పంత్ ప్రశంసిస్తూ కనిపించాడు. అదే సమయంలో వికెట్ కీపర్ పంత్ కూడా విరాట్ వైపు చూసి నవ్వాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

తర్వాతి కథనం
Show comments