Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నుంచి భారత్ - సౌతాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ : టీమిండియాలో కీలక మార్పులు

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (09:55 IST)
భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా, సెంచూరియన్ పార్కు వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఏకంగా ఇన్నింగ్స్ 31 పరుగులు తేడాతో ఓడిపోయింది. పైగా, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు ఏకంగా పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. దీంతో ఈ నెల 3వ తేదీన కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌‍లో గెలుపే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది. ఇందుకోసం టీమిండియాలో రెండు కీలక మార్పులు చేయనుంది. 
 
వెన్నునొప్పి కారణంగా మొదటి టెస్టుకు దూరమైన స్పిన్నర్ రవీంద్ర జడేజాను రెండో టెస్టుకు దూరంగా ఉంచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి జడేజా గాయంపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే అతడు అందుబాటులో ఉంటే జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేప్ టౌన్ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందనే అంచనాలున్నాయి. ఇందుకు అనుగుణంగా నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్‌లో ఆడాలనుకుంటే రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టి జడేజాను తీసుకునే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
 
ఇక మొదటి టెస్టులో పేసర్లు ప్రసిద్ధ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ ఒకే ఒక్క వికెట్ తీసి నిరాశపరిచాడు. దీంతో అతడిని రెండో టెస్టుకు పక్కనపెట్టే అవకాశాలున్నాయి. సెంచూరియన్ టెస్టులో భుజం గాయానికి గురైన శార్థూల్ ఠాకూర్ సోమవారం ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. అతడు ఫిట్‌గా ఉండడంతో జట్టులో యథావిధిగా కొనసాగించే అవకాశాలున్నాయి. అయితే ప్రసిద్ధి స్థానంలో అవేష్ ఖాన్ లేదా ముఖేష్ కుమార్ను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. 
 
భారత తుది జట్టు అంచనా ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ సింగ్  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments