Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొన్నిసార్లు మౌనంగా ఉండిపోవడం మంచిది.. రిషబ్ పంత్ ట్వీట్...

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (14:15 IST)
బెంగుళూరు వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్ జట్టు చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆటగాళ్లు చెత్త ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్ ఫలితంలో భారత భారీ మూల్యం చెల్లించుకుంది. టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతను పెట్టిన పోస్ట్‌లో ఏదో నిగూఢార్థం ఇమిడివుంది. "కొన్నిసార్లు నిశ్బబ్దంగా ఉండటం ఉత్తమం.. మనుషులని దేవుడినే చూడనిద్ధాం" అంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు. దీంతో పంత్ పెట్టిన పోస్ట్ ఉద్దేశ్యం ఏమిటనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టుపై ఆరా తీస్తున్నారు. 
 
ఇక ఎక్స్ వేదికగా మరో పోస్ట్ పెట్టిన రిషబ్ పంత్.. బెంగళూరు టెస్టులో టీమిండియాకు మద్దతు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో పుంజుకుంటామని చెప్పాడు. బెంగళూరు ప్రేక్షకులు అద్భుత రీతిలో మద్దతు అందించారని, ప్రేమాభిమానాలు చూపించారని పంత్ హర్షం వ్యక్తం చేశాడు. అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నానని, తాము తిరిగి బలంగా పుంజుకుంటామని పంత్ పేర్కొన్నాడు. 
 
'ఈ ఆట మీ పరిమితులకు పరీక్ష పెడుతుంది. పడగొడుతుంది, పైకి లేపుతుంది. మళ్లీ వెనక్కి విసిరేస్తుంది. అయితే ఈ ఆటను ఇష్టపడేవారు ప్రతిసారీ దృఢంగా తయారవుతారు' అని పేర్కొన్నాడు. కాగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయిన నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ పుంజుకోవడంలో రిషబ్ పంత్ తనవంతు పాత్ర పోషించాడు. అయితే, ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 99 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

ఇంజనీరింగ్ విద్యార్థికి ఆ కాల్.. షాకైయ్యాడు.. తర్వాత ఏం జరిగిందేంటంటే?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

తర్వాతి కథనం
Show comments