బ్యాటింగ్ - బౌలింగ్ చెత్తగా చేశాం.. అందుకే ఓడిపోయాం : రాహుల్

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (11:37 IST)
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ బ్యాటింగ్ తీరుతో పాటు బౌలింగ్ కూడా చెత్తగా ఉన్నదని అందువల్లే తాము ఓడిపోయినట్టు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నారు. ఐపీఎల్ 2023లో భాగంగా, సొంతమైదానంలో లక్నో జట్టు పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఇరు జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన రాహుల్ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 
 
ఓపెనర్, కెప్టెన్ రాహుల్ 56 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 74 పరుగులు చేశారు. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ కూడా 29 పరుగులు చేశాడు. వీరిద్దరూ మినహా మిగిలిన ఆటగాళ్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్నో జట్టు 159 పరుగులు చేసింది. ఆ తర్వాత 160 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు మరో మూడు బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 
 
ఈ ఓటమిపై కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందిస్తూ, బ్యాటింగ్, బౌలింగ్‌లో సమిష్టి వైఫల్యం కారణంగానే ఓటమి పాలైనట్టు తెలిపారు. తప్పులు నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌లో సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని చెప్పారు. నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మేయర్, పూరన్ మాత్రమే బాగా ఆడారు. ఇపుడు కూడా అలాగే ఆడివుంటే ఖచ్చితంగా జట్టు స్కోరు 180 నుంచి 190 మంది ఉండేది. 
 
కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు మావాళ్లు ఆశించిన రీతిలో ఆడలేక పోయారు. బౌండరీ లైన్ల వద్ద ప్రత్యర్థి ఫీల్డర్ల చేతికి బంతి చిక్కడంతో తొందరగా ఔటై పోయారు. వాళ్లు గనుక కుదురుకుని ఉంటే మా జట్టు స్కోరు ఖచ్చితంగా ఉండేది. ఆటలో గెలుపోటములు సహజం. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments