Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాది చెత్త బౌలింగ్.. అందుకే భారత బ్యాట్స్‌మెన్లు ఉతికేశారు : జాసన్ హోల్డర్

తమ బౌలర్లు చెత్త బౌలింగ్ చేశారనీ, అందువల్లే భారత బ్యాట్స్‌మెన్లు ఉతికి ఆరేశారని వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నారు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండ

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (11:26 IST)
తమ బౌలర్లు చెత్త బౌలింగ్ చేశారనీ, అందువల్లే భారత బ్యాట్స్‌మెన్లు ఉతికి ఆరేశారని వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నారు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టుపై భారత్ 92 పరుగుల తేడాతో విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే.
 
దీనిపై విండీస్ కెప్టెన్ హోల్డర్ స్పందిస్తూ... జట్టు కనీస స్థాయిలో కూడా పోరాట పటిమ చూపలేదన్నాడు. బౌలింగ్‌లో ఘోరవైఫల్యం చెందామని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు భారీ స్కోరు చేసే అవకాశం ఇవ్వడం ద్వారా ముందే లొంగిపోయామన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో తమ జట్టు బౌలింగ్ బాలేదని అంగీకరించాడు. 
 
ప్రత్యర్థి జట్టుపై కనీస ఒత్తిడి తేలేకపోయామన్నారు. తాము బౌలింగ్ చేసిన విధానం టెస్టు క్రికెట్‌కు సరిపోదన్నారు. బౌలింగ్ విభాగంలో వైఫల్యమే తొలిటెస్టు ఓటమికి కారణమని చెప్పిన హోల్డర్, బౌలింగ్ విభాగంలో చాలా మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. తర్వాత జరగనున్న టెస్టు నాటికి పుంజుకుని టీమిండియాకు గట్టిపోటీ ఇస్తామని హోల్డర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments