Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్ల్యూటీసీ ఫైనల్‌: కోహ్లీని కౌగిలించుకున్న కెప్టెన్ విలియమ్సన్‌

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (12:21 IST)
Kane Williamson
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాపై న్యూజిలాండ్ విజయం సాధించి ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. కేన్‌ సేన 8 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో విన్నింగ్ షాట్‌ కొట్టిన రాస్‌టేలర్‌ను అభినందించిన కివీస్ కెప్టెన్ నేరుగా కోహ్లీ వద్దకు వచ్చి కౌగిలించుకున్నాడు. అలానే కొద్దిసేపు భుజంపై తలను ఆనించి ఉంచాడు. అయితే నెట్టింట్లో అదో పెద్ద సంచలనంలా మారిపోయింది. 
 
తాజాగా దీనిపై కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌ స్పందించాడు. టీమిండియా సారథి, నేను మంచి మిత్రులమేనని, చాలా ఏండ్లుగా మాస్నేహం కొనసాగుతుందని వెల్లడించాడు. బరిలో ప్రత్యర్థులమే కావొచ్చు.. మ్యాచ్‌ అనంతరం స్నేహితులమని, అంతర్జాతీయ క్రికెట్‌లో ఫ్రెండ్‌ షిప్‌లు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నాడు.
 
తాను భారత సారథి చాలాకాలంగా స్నేహితులుగా కొనసాగుతున్నాం. మేమిద్దరం సహచరులం కూడా. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని కలిసే అవకాశం క్రీడల వల్ల దొరుకుతుంది. అలాగే కొంతమంది స్నేహితులు కూడా లభిస్తారు. 
 
ఒకే మ్యాచ్‌లో ఆడుతున్నా.. ప్రత్యర్థులగా బరిలోకి దిగినా సరే భిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి. ఒక్కోసారి ఇష్టాయిష్టాలు కూడా కలుస్తాయి అని కివీస్ కెప్టెన్ తెలిపాడు. ఒక మ్యాచులో ఓడిపోవచ్చు, కానీ, టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దని.. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీసేన బలమైన జట్టని పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

తర్వాతి కథనం
Show comments