Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-9వ సీజన్ విజేతగా సన్‌రైజర్స్.. బస్సులో ఖుషీ ఖుషీ.. యువీ లవర్ కూడా?!

Webdunia
మంగళవారం, 31 మే 2016 (17:46 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో హైదరాబాదీ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ ఫైనల్లో గెలుపును నమోదు చేసుకోవడం ద్వారా ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలిసారి ఫైనల్‌కు చేరిన సన్ రైజర్స్.. ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న సంతోషంతో జట్టు సభ్యులంతా ఎగిరి గంతేశారు. 
 
మ్యాచ్ అనంతరం బస్సులో ప్రయాణీస్తున్న సమయంలో తోటి సభ్యుల సంతోషాన్ని యువీ తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అరుపులు, కేకలు, విజిల్స్‌తో చెలరేగిపోయారు. ఈ వీడియోలో యువరాజ్ సింగ్ ప్రియురాలు కీచెల్ కూడా ఉంది. జట్టు సభ్యుల ఆనందాన్ని చూసి తెగ నవ్వేసింది. 
 
కాగా ఐపీఎల్ 9వ సీజన్ విజేతగా సన్ రైజర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. తొలిసారి ఫైనల్లోకి చేరిన హైదారాబాద్ టీమ్.. కోహ్లీ జట్టును ఓడించింది.   ఐపీఎల్-9 ఫైనల్లో 8 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. 
 
టైటిల్ వేటలో బెంగళూరును మూడోసారి భంగపాటుకు గురిచేస్తూ.. టోర్నీలో కొత్త చరిత్రను లిఖించింది. కెప్టెన్ వార్నర్ వీరంగం సృష్టించగా... ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్‌లో కొత్త చాంపియన్‌గా హైదరాబాద్ సైన్‌రైజర్స్ ఉదయించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

హైదరాబాద్‌ లో అల్లు అర్జున్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పర్యవేక్షణలో అట్లీ

Ruchi Gujjar video రుచి గుజ్జర్ ఎద ఎత్తులపై ప్రధాని మోడి ఫోటోల దండ

Ratnam: వినోదంతో పాటు, సందేశం ఇవ్వాలనేది నా తపన : ఎ.ఎం. రత్నం

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

తర్వాతి కథనం
Show comments