Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 వరల్డ్‌కప్‌ తర్వాత కూడా ఆడగలను: మహేంద్ర సింగ్ ధోనీ

టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి, టెస్టు కెప్టెన్సీ నుంచి కూల్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ రిటైర్మెంట్ తీసుకుని చాలాకాలమైంది. దీంతో టెస్ట్ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తనదైన శైలిలో విజయ

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (09:33 IST)
టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి, టెస్టు కెప్టెన్సీ నుంచి కూల్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ రిటైర్మెంట్ తీసుకుని చాలాకాలమైంది. దీంతో టెస్ట్ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తనదైన శైలిలో విజయాలతో దూసుకుపోతున్నాడు. కానీ ప్రపంచకప్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ ధోనీ లేకపోవడం రిస్కేనని అన్నట్లు సమాచారం.
 
కోహ్లీకి కెప్టెన్సీ అప్పగించడంపై కిర్‌స్టెన్ ఏమీ మాట్లాడకపోయినప్పటికీ ధోనీని తొలగించడం మాత్రం భారత జట్టుకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. గొప్ప ఆటగాళ్లు చివరి వరకూ వారి సేవలను అందించగలరని గ్యారీ కిర్‌స్టన్ అన్నారు. ఒకవేళ ధోనీ కెప్టెన్‌గా లేకపోతే 2019లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా విజయావకాశాలు తగ్గుతాయని కూడా గ్యారీ గతంలో అభిప్రాయపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో క్రికెట్‌నుంచి ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచనలేదని భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ చెప్పకనే చెప్పేశాడు. ఈ ఏడాది జరిగే చాంపియన్స్‌ ట్రోఫీతో ధోనీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాడని వచ్చిన ఊహాగానాలకు ధోనీ చెక్ పెట్టాడు. అంతేగాకుండా 2019 ప్రపంచకప్‌కు తర్వాత ఆడుతానన్నట్లు చెప్పాడు.
 
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నధోనీ నూటికి నూరు శాతం 2019 వరల్డ్‌కప్‌ ఆడగలనా అంటే తాను చెప్పలేనని.. ప్రపంచకప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో.. ఈలోగా గాయాల పాలవ్వచ్చు. ఏదైనా జరగొచ్చునని ధోనీ అన్నాడు. అయితే ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌ ఆధారంగా చెప్పాలంటే మాత్రం 2019 వరల్డ్‌కప్‌ తర్వాత కూడా ఆడగలనని మహేంద్రుడు అన్నాడు. 
 
35 ఏళ్లు దాటిన ధోనీ.. ప్రపంచ కప్ కూడా ఆడతాననే విధంగా కామెంట్స్ చేయడం అందరికీ షాక్ ఇచ్చినట్లే. ఒకవేళ అదే జరిగితే మహీ నాలుగు వరల్డ్‌కప్‌ల్లో పాల్గొన్న ఆటగాడిగా రికార్డులకెక్కే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments