Webdunia - Bharat's app for daily news and videos

Install App

#VaathiComing పాటకు స్టెప్పులేసిన టీమిండియా క్రికెటర్లు (Video)

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (17:51 IST)
VaathiComing
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా దక్షిణాది సినిమా పరిశ్రమలో సంచలనాలు సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని 'వాత్తి కమింగ్..' పాట విజయ్ అభిమానులతో పాటు సంగీతాభిమానులను, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నది. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ పాటకు స్టెప్పులేసిన విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమ నుంచే గాక క్రికెటర్లు కూడా ఈ హుషారు గీతానికి కాలు కదిపారు.
 
భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇటీవలే ముగిసిన రెండో టెస్టులో కూడా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ పాటకు కాలు కదిపాడు. అయితే అది కొద్దిసేపే. తాజాగా ఇదే పాటకు రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు, భారత ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా, మిస్టరీ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లు కలిసి డాన్స్ చేశారు.
 
ఈ వీడియోను రవిచంద్రన్ అశ్విన్ తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్టు చేశారు. వీడియోను షేర్ చేస్తూ.. తమ డాన్స్ తో వాత్తి కూడా సంతోషంగా ఉంటాడని అశ్విన్ రాసుకొచ్చాడు. ఇక వీడియోలో అశ్విన్ తానే పాటకు స్టెప్పులేస్తూ డాన్స్ ప్రారంభించగా.. వెనకాలే ఉన్న పాండ్యా అందుకుని తనదైన మార్కులో కాలు కదిపాడు. ఇక వీరిద్దరి వెనకాల ఉన్న కుల్దీప్ యాదవ్ అయితే డాన్స్ తో కుమ్మేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashwin (@rashwin99)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments