Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ ముద్దు.. వీడియో వైరల్

వరుణ్
ఆదివారం, 30 జూన్ 2024 (09:39 IST)
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ ఆదుకోగా, బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా ఆదుకున్నాడు. ఫలితంగా భారత క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచాడు. అయితే, టీమిండియా జట్టు ప్రపంచ కప్ సాధించిన ఆనందంలో ఆల్‌‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు టీమిండియా సారథి రోహిత్ శర్మ ముద్దిచ్చిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయి విజయం భారత్ చేతికి చిక్కిన తర్వాత రోహిత్ శర్మ మైదానంపై పడిపోయి విజయాన్ని ఆస్వాదించాడు. 
 
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ అయితే చిన్నపిల్లాడిలా గంతులేశాడు. మ్యాచ్ తర్వాత హార్దిక్ పాంద్యా మైదానంలో మాట్లాడుతుండగా రోహిత్ వచ్చి ముద్దిచ్చాడు. ఆటతీరుపై ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా ఫైనల్‌లో మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. గెలుపు తర్వాత ఆనందం పట్టలేక ఏడ్చేశాడు. 
 
సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన సమయంలో హెన్రిక్ క్లాసెన్ వికెట్ తీసిన పాండ్యా మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పాడు. ఈ విజయం తనకు చాలా స్పెషల్ అని, గత ఆరు నెలల్లో తాను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని గుర్తుచేశారు. కష్టపడితే ఫలితం ఉంటుందని నమ్మానని చెప్పాడు. ఇలాంటి అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమన్నాడు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలోనే తొలిసారి.. ఫ్లైయింగ్ ట్యాక్సీలు.. ఎక్కడ?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో కోసం గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్యం వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

తర్వాతి కథనం
Show comments