ఇంగ్లండ్‍‌తో టెస్ట్ సిరీస్ : టీమిండియా కోచ్‌గా వీవీఎస్.లక్ష్మణ్

ఠాగూర్
ఆదివారం, 15 జూన్ 2025 (22:32 IST)
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. సీనియర్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, కొత్త సారథి శుభమన్ గిల్ నేతృత్వం వస్తుండటంతో ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌లకు ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ అందుబాటులో ఉండే పరిస్థితులు కనిపించడం లేదు. తన తల్లి ఆరోగ్యం పరిస్థితుల నేపథ్యంలో గంభీర్ ఇంగ్లండ్ నుంచి తిరుగుపయనమయ్యాడు. 
 
దీంతో కోచ్ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పగించారు. కాగా, ప్రస్తుతం లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడెమీ చైర్మన్‌గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. అండర్-19 జట్టు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లక్ష్మణ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. గంభీర్ తిరిగి వచ్చేంతవరకు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. గతంలో సౌతాఫ్రికాతో జరిరగిన టీ20 సిరీస్‌కు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించారు. అయితే, గంభీర్ తిరిగి ఇంగ్లండ్ ఎపుడు వెళతామన్నదానిపై స్పష్టమైన సమాచారం. లేదు. కాగా, ఇంగ్లండ్, భారత్ మధ్య టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ జూన్ 20వ లీడ్స్‌లో మొదలవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

తర్వాతి కథనం
Show comments