Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క టూర్ కోసం భారత క్రికెట్ జట్టు కోచ్‍‌గా వీవీఎస్ లక్ష్మణ్

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (07:59 IST)
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే దేశ ప్రర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఆసియా కప్ మొదలుకానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఆగస్టు 18, 20, 22 తేదీల్లో జింబాబ్వేతో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. 
 
జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ అవతారమెత్తారు. త్వరలో జింబాబ్వేలో పర్యటించే టీమిండియాకు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనలో టీమిండియా, జింబాబ్వే జట్టుతో 3 వన్డేలు ఆడనుంది. 
 
కాగా, రెగ్యులర్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీ20 జట్టుతో కలిసి ఆసియా కప్ కోసం ఈ నెల 23న యూఏఈ చేరుకుంటాడని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. రాహుల్ ద్రావిడ్‌కు విరామం ఇచ్చినట్టు కాదని స్పష్టం చేశారు. 
 
ఆసియా కప్‌లో పాల్గొనే ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, దీపక్ హుడా మాత్రమే జింబాబ్వే టూరులో పాల్గొంటున్నారని, మిగతా టీ20 జట్టంతా రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఆసియాకప్‌కు సన్నద్ధమవుతుందని జై షా వివరించారు. ద్రావిడ్ ప్రధాన జట్టుతో పాటే ఉంటాడని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

తర్వాతి కథనం
Show comments