Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడి ప్రసాదాన్ని స్వీకరించకుండా భార్యతో గడిపిన క్రికెటర్ ఎవరు?

ఢిల్లీకి చెందిన వెటరన్ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. ఈ క్రికెటర్‌కు మరో క్రికెటర్ దేవుడితో సమానం ఆ దేవుడు ఎవరో కాదు క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (16:25 IST)
ఢిల్లీకి చెందిన వెటరన్ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. ఈ క్రికెటర్‌కు మరో క్రికెటర్ దేవుడితో సమానం ఆ దేవుడు ఎవరో కాదు క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. వీరిద్దరు కలిసి భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించారు. ఆ తర్వాత ఇద్దరూ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పారు. 
 
అయితే, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బయోపిక్ 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' అనే చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇది విడుదలైన తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదిలావుంటే, భారత క్రికెటర్ల కోసం ఈ సినిమాను బుధవారం ముంబైలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. అయితే ఈ ప్రీమియర్‌కు సచిన్‌కు అత్యంత ఇష్టమైన ఓ వ్యక్తి రాలేదు. ఆ క్రికెటర్ ఎవరో కాదు వీరేంద్ర సెహ్వాగ్. 
 
నిజానికి సచిన్‌ను దేవుడు, గురువు అంటూ సెహ్వాగ్ సంబోధిస్తుంటాడు. కానీ, సచిన్ : ఏ బిలియన్ డ్రీమ్ చిత్రానికి ఎందుకు రాలేదన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో డాషింగ్ ఓపెనర్ వివరణ ఇచ్చారు. అదీ కూడా ఓ వీడియో ద్వారా. "ప్రీమియర్‌కు తనకు ఆహ్వానం అందింది. అయితే ఇదే సమయంలో నేను నా భార్యతో హాలిడే ట్రిప్ లో ఉన్నా. దేవుడి ప్రసాదాన్ని ఆస్వాదించకుండా... భార్య ఆర్తితో గడపాల్సి వచ్చింది" అని అందులో పేర్కొన్నారు. 
 
వాస్తవానికి డ్రెస్సింగ్ రూములో ఉన్నప్పుడు, నాన్ స్ట్రైకర్‌గా క్రీజులో ఉన్నప్పుడు సచిన్‌ను ఫ్రీగా చూశానని... ఇప్పుడు సచిన్ బ్యాటింగ్ చూసేందుకు డబ్బును, సమయాన్ని ఖర్చు చేస్తానని చెప్పాడు. ఈ సినిమా ద్వారా ఎంతో మందిలో సచిన్ స్ఫూర్తిని నింపుతాడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఆగ్రహం : సస్పెండ్ దిశగా ఆలోచనలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments