Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడం టూసాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (08:23 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాదించారు. ఇప్పటికే ఢిల్లీ, లండన్ మ్యూజియాల్లో ఆయన మైనపు విగ్రహం కొలువుదీరివుంది. ఇపుడు తాజాగా దుబాయ్ మ్యూజియంలోనూ కొలువుదీరింది. దుబాయ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మేడం టుసాడ్స్ మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. 
 
ప్రస్తుతం ఐసీసీ నిర్వహించే ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ దుబాయ్ వేదికగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. టీమిండియా వన్డే జెర్సీ ధరించిన కోహ్లీ బౌలింగును ఎదుర్కొనేందుకు బ్యాట్ ఎత్తి సిద్ధంగా ఉన్నట్టుగా విగ్రహాన్ని రూపొందించారు. 
 
కోహ్లీతోపాటు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్ స్టార్లు రొనాల్డో, మెస్సి, ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ తదితరుల విగ్రహాలను కూడా ఈ మ్యూజియంలో ఇది వరకే ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానాశ్రయ చెత్తబుట్టలో శిశువు మృతదేహం!!

Hyderabad: వేడి నీళ్లతో నిండిన బకెట్‌లో పడి నాలుగేళ్ల బాలుడి మృతి

పారిశుద్ధ్యం కార్మికుల వేషంలో యూట్యూబర్ ఇల్లు ధ్వంసం... ఇంట్లో మలం వేశారు..

Rajini: ఎంపీ లావు కృష్ణ దేవ రాయలకు పూర్తి వడ్డీతో తిరిగి చెల్లిస్తాను.. రజనీ స్ట్రాంగ్ వార్నింగ్

వైకాపా హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్‌పై హోం మంత్రి అమిత్ షా ఆరా!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

తర్వాతి కథనం
Show comments