Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత : 10 వేల రన్స్ క్లబ్‌లోకి ఎంట్రీ!

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (10:49 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించారు. అంతర్జాతీయ వన్డేల్లో 10 వేల పరుగులు సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. ముఖ్యంగా, వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాట్స్‌మెన్‌గా అవతరించడం ఇక్కడ గమనార్హం. 
 
ఈ జాబితాలో కోహ్లీ కంటే ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. 330 ఇన్నింగ్స్‌లలో మూడో స్థానంలో బరిలోకి దిగిన పాంటింగ్ 12,662 పరుగులు చేశాడు. అయితే, కోహ్లీ మాత్రం ఈ ఫీట్‌ను 190 ఇన్నింగ్స్‌లలోనే అధికమించాడు. శనివారం జరిగిన వన్డేలో 66 పరుగులు చేసిన కోహ్లీ.. ఈ ఫీట్‌‌ను సాధించాడు. 
 
కాగా, ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర మూడో స్థానంలో ఉన్నాడు. 238 ఇన్నింగ్స్ లలో సంగక్కర 9,747 పరుగులు చేశాడు. 7,774 పరుగులతో దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ జాక్వెస్ కల్లిస్ ఉన్నాడు. రికీ పాంటింగ్ రికార్డును అధిగమించడానికి కోహ్లీకి మరెంతో కాలం పట్టదని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

గర్భిణులకు ఓవర్ డోస్ యాంటీబయోటిక్స్.. నకిలీ డాక్టర్ అరెస్ట్

అదానీతో జగన్ మెడకు ఉచ్చు.. విచారణ ఖాయమేనా..?

పవన్ ప్రచారం ఫలించింది.. రేవంతన్న క్యాంపెయిన్ తప్పిపోయింది..

మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే గెలిపించింది.. బాబు, పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

తర్వాతి కథనం
Show comments