Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర సృష్టించిన భారత్.. 85 యేళ్ల టెస్ట్ హిస్టరీలో... హేమాహేమీలకు సాధ్యంకానిది...

కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 85 యేళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా పరాయి గడ్డపై టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా కోహ్లీ సేన టెస్ట్ క

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (15:48 IST)
కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 85 యేళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా పరాయి గడ్డపై టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా కోహ్లీ సేన టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ పేజీని సువర్ణాక్షరాలతో లిఖించింది.
 
ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టు వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్‌లలో గెలుపొందింది. చివరి టెస్టులోనూ ఇన్నింగ్స్ 171 ప‌రుగుల తేడాతో శ్రీలంక‌ను చిత్తు చేసింది. 85 ఏళ్ల టెస్టు చ‌రిత్ర‌లో విదేశాల్లో భార‌త్ తొలిసారి టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినందుకు టీమిండియా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. 
 
రెండో ఇన్నింగ్స్ ఫాలో‌ఆన్ ఆడిన శ్రీలంక ఆదివారం రెండు వికెట్లు కోల్పోయింది. సోమవారం 19/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక జట్టు భారత్ బౌలర్లు అశ్విన్ (4 వికెట్లు), మహ్మద్ షమీ (3 వికెట్లు) ధాటికి ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు. కేవ‌లం 181 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 
 
అదేసమయంలో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేసిన విష‌యం తెలిసిందే. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో అశ్విన్ 4, ష‌మీ 3, ఉమేశ్‌ యాదవ్ 2, కుల్‌దీప్ యాద‌వ్ 1 వికెట్లు ప‌డ‌గొట్టారు. భారత జట్టులో ఓపెనర్లు ధవాన్ 119, రాహుల్ 85, టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా 108 చొప్పున పరుగులు చేసి రాణించిన విషయం తెల్సిందే. 
 
కాగా, గత నెల 26న గాలెలో జరిగిన తొలి టెస్ట్‌లో 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా ఆగస్టు 3న ప్రారంభమైన రెండో టెస్ట్‌ను ఇన్నింగ్స్ 53 పరుగులతో గెలుచుకుంది. తాజాగా సోమవారం ముగిసిన చివరిదైన మూడో టెస్ట్‌లో ఇన్నింగ్స్ 171 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఈ రికార్డు అలాంటి ఇలాంటిది కాదు. 
 
85 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు సాధ్యంకాని దానిని కోహ్లీ చేసి చూపించాడు. విదేశీ గడ్డపై సిరీస్‌ను నెగ్గడమే కాక ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేసిన ఘనత సాధించాడు. భారత జట్టుకు సారథ్యం వహించిన హేమాహేమీలనదగ్గ ఆటగాళ్లకు సాధ్యం కానీ రికార్డును కోహ్లీ అందుకుని తానేంటో మరోమారు నిరూపించాడు. కాగా, శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఈనెల 20న దంబుల్లాలో జరగనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

తర్వాతి కథనం
Show comments