Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంక్ డౌన్... ఆస్ట్రేలియా జట్టు నుంచి మిచెల్ ఔట్

ఆస్ట్రేలియాపై సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సేన ఘనవిజయం సాధించినప్పటికీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ర్యాంక్ మూడో స్థానానికి దిగజారింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ఒ

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (19:39 IST)
ఆస్ట్రేలియాపై సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సేన ఘనవిజయం సాధించినప్పటికీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ర్యాంక్ మూడో స్థానానికి దిగజారింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ఒక స్థానాన్ని కోల్పోయాడు. రెండో స్థానం నుంచి మూడుకు వచ్చాడు. దీంతో అంతకుముందు మూడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండుకు ఎగబాకాడు. అయితే వీరిద్దరి మధ్య కేవలం ఒక్క పాయింట్ మాత్రమే. 
 
936 పాయింట్లతో టాప్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో కోహ్లీ అత్యల్ప స్కోర్లకే ఔట్ కావడంతోనే ర్యాంకింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు... అశ్విన్, జడేజా టెస్టుల్లో అగ్రస్థానాన్ని పంచుకున్నారు. 2008 తర్వాత మళ్లీ టెస్టుల్లో ఇద్దరు బౌలర్లు నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.
 
ఇకపోతే.. ఆస్ట్రేలియా జట్టులోకి మిచెల్ మార్ష్ స్థానంలో మార్కస్ స్టొయినిస్ రానున్నాడు. భుజం గాయం తిరగబెట్టడంతో ఆల్‌రౌండర్ మార్ష్ స్వదేశం వెళ్లిపోతున్నాడు. అతని స్థానంలో మరో ఆల్ రౌండర్ మార్కస్ జట్టులోకి తీసుకున్నారు. మార్కస్ మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. గత నెలలో ఛాపెల్‌-హ్యాడ్లీ సిరీస్‌లో న్యూజిలాండ్‌పై 146 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments