Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ వీధుల్లో సామాన్యుడిలా చక్కర్లు కొడుతున్న విరాట్ కోహ్లీ

ఠాగూర్
సోమవారం, 18 ఆగస్టు 2025 (11:19 IST)
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి లండన్ వీధుల్లో సామాన్యుడిలా చక్కర్లు కొడుతున్నారు. భారత్‌లో ఉండే అభిమానుల కోలాహలానికి దూరంగా సాదాసీదా సామాన్యుడిలా లండన్ వీధుల్లో తిరుగుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో కోహ్లీ, అనుష్క స్థానికులతో ముచ్చటిస్తున్నట్టు కనిపిస్తోంది. తమను గుర్తుపట్టిన వారితో ఈ సెలెబ్రిటీ జంట నవ్వుతూ పలకరించడం, సరదాగా మాట్లాడటం వంటివి ఈ వీడియోలో ఉన్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా వారు తమ వ్యక్తిగత సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. 
 
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు‌కు టైటిల్ అందించిన తర్వాత కోహ్లీ ఈ విరామం తీసుకున్నారు. కాగా, ఈ యేడాది మే నెలలో ఆయన టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెల్సిందే. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

తర్వాతి కథనం
Show comments