Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదర్భ క్రికెటర్ ఖాతాలో డబుల్ హ్యాట్రిక్

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (11:48 IST)
సాధారణంగా అది దేశవాళీ లేదా అంతర్జాతీయ క్రికెట్లలో హ్యాట్రిక్ సాధించడమే చాలా అరుదుగా సాగుతుంది. కానీ, విదర్భ క్రికెటర్ దర్శన్ నల్కండే మాత్రం ఏకంగా డబుల్ హ్యాట్రిక్ సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనట చోటుచేసుకుంది. నాలుగు బంతుల్లో నలుగురిని పెవిలియన్‌కు చేర్చడం ద్వారా ఈ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. గతంలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ అభిమన్యు మిథున్ ఉన్నాడు. 
 
ఈ టోర్నీలో భాగంగా, శనివారం ఢిల్లీలో కర్నాటక జట్టుతో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో దర్శన్ బంతితో చెలరేగిపోయాడు. తాను వేసిన ఓవర్‌లో రెండో బంతికి జోషి (1)ని ఔట్ చేసి, మూడో బంతికి శరత్‌ను నాలుగో బంతికి జె.సుచిత్‌ను డకౌట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. 
 
ఆ తర్వాత చివరి బంతికి ఫామ్‌‍లో ఉన్న మనోహర్‌ను 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ శాడు. తద్వారా డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఫలితంగా ఈ రికార్డు సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డును అభిమన్యు మిథున్ సాధించాడు. 
 
అయితే, మిథున్ ఏకంగా ఐదు బంతుల్లో ఐదుగురు ఆటగాళ్లను ఔట్ చేసి రికార్డు సృష్టించాడు. కర్నాటకకు మిథున్ ప్రాతినిథ్యం వహించిన  2019లో ఈ రికార్డు సాధించాడు. కానీ, దర్శన్ మాత్రం నాలుగు బంతుల్లో నలుగురిని పెవిలియన్‌కు చేర్చి రికార్డు సాధించాడు. దీంతో శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగా పేరుతో ఉన్న రికార్డును సమం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments