Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేశ్ రైనా బంధువులపై దోపిడీ.. మోస్ట్ వాంటెడ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (19:55 IST)
టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా బంధువులు దోపిడీ దొంగల దాడిలో మృతి చెందిన ఘటన మూడేళ్ల క్రితం ఐపీఎల్ సందర్భంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో రైనా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. పంజాబ్‌లోని థరియాల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
రైనా మామయ్య అశోక్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దోపీడీ దొంగలు దాడి చేసారు. ఈ ఘటనలో అశోక్ కుమార్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య, కుమారులు ఆస్పత్రి పాలయ్యారు. 
 
కుమారుడు కౌశల్ చికిత్స పొందుతూ మరణించగా, భార్య, మరో కుమారుడు కోలుకున్నారు. ఈ కేసులో నిందితుడైన రషీద్‌ను పోలీసులు మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించారు.
 
గత మూడేళ్లుగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో యూపీలో రషీద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. రషీద్ పోలీసులపై దాడికి యత్నించడంతో, ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments