Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాస్ట్‌ బౌలర్లకు స్ఫూర్తినిస్తున్న ఉమేశ్ యాదవ్ మెరుపు బౌలింగ్

భారత్‌కు నిరాశ కలిగించిన మూడో రోజు ఆటలో చెప్పుకోదగ్గ అంశం ఉమేశ్‌ యాదవ్‌ ప్రదర్శన. రెండో రోజు 142 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతితో సౌమ్య సర్కార్‌ను అవుట్‌ చేసిన అతను, శనివారం కూడా దానిని కొనసాగించాడు. అటు వేగం, ఇటు స్వింగ్‌ జత కలిపి ప్రత్యర్థి బ్యాట్స

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (04:02 IST)
మహా మహా జట్లే బారత్ చేతిలో పేకమేడల్లా కూలిపోయిన తరుణంలో టెస్ట్ క్రికెట్లో పసికూనలుగా భావిస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు హైదరాబాద్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు భారత్‌కి చుక్కలు చూపించింది. రోజు మొత్తం మీద 5 వికెట్లు మాత్రమే భారత బౌలర్లు పడగొట్టగా అందులో రెండు బంగ్లా బాట్స్‌మెన్ చేతకానితనం వల్లే జరిగాయి. మూడో రోజు భారత్ స్పిన్నర్లు తేలిపోగా ఫేసర్ ఉమేష్ యాదవ్ నాణ్యమైన బౌలింగ్‌తో స్పిన్ పిచ్‌లో బంగ్లా జట్టుకు చుక్కలు చూపించాడు.ట
 
భారత్‌కు నిరాశ కలిగించిన మూడో రోజు ఆటలో చెప్పుకోదగ్గ అంశం ఉమేశ్‌ యాదవ్‌ ప్రదర్శన. రెండో రోజు 142 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతితో సౌమ్య సర్కార్‌ను అవుట్‌ చేసిన అతను, శనివారం కూడా దానిని కొనసాగించాడు. అటు వేగం, ఇటు స్వింగ్‌ జత కలిపి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఆధిక్యం ప్రదర్శించాడు. ముఖ్యంగా 23 నుంచి 33 వరకు ఆరు ఓవర్ల పాటు సాగిన  రెండో స్పెల్‌లో ఉమేశ్‌ చెలరేగిపోయాడు. ముందుగా మోమినుల్‌ను అవుట్‌ చేసిన అతను, ఆ తర్వాత వేగవంతమైన ఆఫ్‌ కట్టర్లతో షకీబ్‌ను బెదరగొట్టాడు. 
 
అటు ఫీల్డింగ్‌లో కూడా కొన్నాళ్లుగా మైదానంలో పాదరసంలా కదులుతూ ఫాస్ట్‌ బౌలర్లకు స్ఫూర్తినిస్తున్న ఉమేశ్, మరోసారి అలాంటి ఆటనే చూపించాడు. అతని అద్భుతమైన త్రో కారణంగానే తమీమ్‌ రనౌటయ్యాడు. ఉమేశ్‌ పని అంతటితో పూర్తి కాలేదు. అశ్విన్‌ బౌలింగ్‌లో మిడాన్‌లో చక్కటి క్యాచ్‌ కూడా అందుకొని ప్రధాన బ్యాట్స్‌మన్‌ షకీబ్‌ను పెవిలియన్‌ పంపాడు. మొత్తంగా మూడోరోజు ఆటలో మైదానంలో అన్నింటా ఉమేశ్‌ కనిపించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

తర్వాతి కథనం
Show comments