Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఉప్పల్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (09:19 IST)
మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ బుధవారం జరుగనుంది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇందుకోసం 2500 మంది పోలీసులతో గట్టి భద్రతను కల్పించారు. 
 
అలాగే, ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లడానికి వీల్లేదని, అలాంటి వస్తువులు ఏవైనా ఉంటే స్టేడియంలోనికి అనుమతించబోమని పోలీసులు స్పష్టంచేశారు. ఈ మ్యాచ్ ఉప్పల్‌లోని శ్రీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
 
మరోవైపు, ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానుల కోసం హైదరాబాద్ నగర పోలీసులు కొన్ని సూచనలు చేశారు. మొబైల్ ఫోన్స్ మినహా ఇతర ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని రాచకొండ పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరే ముందే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మాత్రమే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని తెలిపారు. 
 
కాగా, స్వదేశంలో పర్యాటక శ్రీలంక జట్టుతో భారత్ మూడు మ్యాచ్‌లలో తలపడింది. ఈ సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది. ఇపుడు కఠిన సవాలుకు సిద్ధమైంది. వరుసగా రెండు వన్డే ప్రపంచ కప్‌ల్లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుతో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం బరిలోకి దించే తుది జట్ల అంచనను పరిశీలిస్తే,
 
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కోహ్లీ, గిల్, సూర్యకుమార్, ఇషాన్, (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సుందర్, చాహల్ లేదా కుల్దీప్, షమి, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
 
కివీస్ : అలెన్, కాన్వే, చాప్‌మన్ లేదా నికోల్స్, మిచెల్, లేథమ్ (కెప్టెన్), ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, శాంట్నర్, షప్లీ, ఫెర్గ్యూసన్, డఫీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

తర్వాతి కథనం
Show comments