Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతగడ్డపై చెత్త రికార్డు మూటగట్టుకున్న సౌతాఫ్రికా - 55 రన్స్‌కే ఆలౌట్

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (17:16 IST)
సొంత గడ్డపై సౌతాఫ్రికా జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ సంఘం నిషేధం విధించిన తర్వాత సౌతాఫ్రికా ఇలాంటి దారుణ స్కోరును చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. బుధవారం నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్ట్ మొదలైంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌కు సఫారీ ఆటగాళ్లు దాసోహమైపోయారు. 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయ్యారు. తద్వారా ఐసీసీ నిషేధం ఎత్తివేసిన తర్వాత సౌతాఫ్రికా చేసిన అత్యల్ప స్కోరు ఇదేకావడం గమనార్హం. గతంలో సౌతాఫ్రికా అత్యల్ప స్కోరు 73 పరుగులుగా ఉంది. ఇపుడు రెండో అత్యల్ప స్కోరు చేసింది. 
 
నిషేధం ఎత్తివేయకముందు సౌతాఫ్రికా అత్యల్ప స్కోరు 30 పరుగులుగా నమోదైంది. 1896లో గబేరా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో సఫారీలు.. 30 రన్స్‌కే చేతులెత్తేశారు. కేప్‌టౌన్‌లో కూడా 1899లో ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు. అయితే ఇదంతా నిషేధం విధించకముందు. 1971లో వర్ణ వివక్ష కారణంగా ఆ జట్టుపై ఐసీసీ రెండు దశాబ్దాల (21యేళ్లు) పాటు నిషేధం విధించింది. 1992లో ఆ జట్టు తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌‌లోకి అడుగుపెట్టింది. నిషేధం ఎత్తివేశాక టెస్టులలో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు.
 
నిషేధానికి ముందు సఫారీల అతి తక్కువ స్కోరు వివరాలను పరిశీలిస్తే, ఇంగ్లండ్‌పై 30 (1896),  ఇంగ్లండ్‌పై 30 (1924), ఇంగ్లండ్‌పై 35 (1899), ఆసీస్‌పై 36 (1932), ఇంగ్లండ్‌పై 43 (1889). నిషేధం తర్వాత తక్కువ స్కోరు భారత్‌పై 55 (2024), శ్రీలంకపై 73 (2018), భారత్‌పై 79 (2015), ఇంగ్లండ్‌పై 83 (2016)గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

తర్వాతి కథనం
Show comments