సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై.. టిక్కెట్ల కోసం ఎదురుచూపు

సెల్వి
సోమవారం, 25 మార్చి 2024 (18:08 IST)
Sunrisers Hyderabad
ఐపీఎల్ 2024 సీజన్ ను సన్‌‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ఆరంభించింది. ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో నాలుగు పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 
 
అయితే.. గెలుపు ముంగిట్లోకి వచ్చి ఓడిపోవడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులు తెగ బాధపడుతున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌ చివరి బాల్‌ వరకు రావడంతో తన వంత పాత్ర పోషించిన ఓ యువ స్టార్‌ క్రికెటర్ల మ్యాచ్‌ ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
 
ఇకపోతే.. తదుపరి మ్యాచ్‌ చెన్నైతో జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోతున్నాయి. అలాగే టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 23376 వద్ద వుంది. సొంత మైదానంలో ఆడనున్న హైదరాబాద్‌లో జోష్ నింపేందుకు క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మ్యాచ్ టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎల్లో టీమ్ ఆర్సీబీపై గెలిచిన జోష్‌లో వుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  
 
సన్‌రైజర్స్ జట్టులో భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్ ఆడేందుకు సిద్ధంగా వున్నారు. ఏప్రిల్ 5న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య పోరు వుంటుంది.  ఏప్రిల్ 5, రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

తర్వాతి కథనం
Show comments