Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే కొత్త చరిత్ర.. 15ఏళ్లలో..?

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (14:38 IST)
zimbabwe
ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే కొత్త చరిత్ర సృష్టించింది. మెగాటోర్నీ ఆరంభమైన 15 ఏళ్లలో జింబాబ్వే తొలిసారి సూపర్‌-12 స్టేజ్‌లో అడుగుపెట్టింది. అతిపెద్ద ఘనత సాధించింది. ఎందుకంటే జింబాబ్వే సరైన క్రికెట్‌ ఆడి దశాబ్దంన్నర గడిచిపోయింది. 
 
ఈ దశాబ్దంన్నరలో జింబాబ్వే జట్టు ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడింది. ఎంతలా అంటే క్రికెటర్లకు కనీసం షూస్‌, జీతాలు చెల్లించలేని పరిస్థితి. అలాంటి స్థితి నుంచి ఇవాళ అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే జింబాబ్వే క్రికెట్లో పునర్వైభవం స్పష్టంగా కనిపిస్తోంది. 
 
బంగ్లాదేశ్‌ను ఓడించిన జింబాబ్వే.. ఆ తర్వాత టీమిండియాకు చెమటలు పట్టించింది. టి20 ప్రపంచకప్‌ ఆరంభమైన నాటి నుంచి జింబాబ్వే క్వాలిఫయింగ్‌ పోరులోనే వెనుదిరుగుతూ వస్తుంది. 2007, 2010, 2012, 201,2016 వరల్డ్‌కప్‌లు ఆడిన జింబాబ్వే గ్రూఫ్‌ దశకే పరిమితమైంది. 
 
తాజాగా టి20 ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ పోరులో ప్రస్తుతం ఒక్క ఓటమి కూడా లేకుండా గ్రూఫ్‌ టాపర్‌గా నిలిచింది. సగర్వంగా సూపర్‌-12లో అడుగుపెట్టింది. 
 
ఇండియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ లాంటి జట్లున్న గ్రూఫ్‌-2లో ఉన్న జింబాబ్వేను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఇక జింబాబ్వే తొలిసారి టి20 ప్రపంచకప్‌లో సూపర్‌-12కు అర్హత సాధించడంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

తర్వాతి కథనం
Show comments