Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహమ్మద్ రిజ్వాన్‌కు ఛాతి ఇన్ఫెక్షన్‌- 2 రోజుల పాటు ఐసీయూలోనే

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (17:45 IST)
Mohammad Rizwan
పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌కు ముందు రెండు రోజుల హాస్పిటల్‌లో ఐసీయూ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. తీవ్రమైన ఛాతి ఇన్‌ఫెక్షన్‌కు అతను చికిత్స పొందాడు. అయితే భారత్‌కు చెందిన పల్మనాలజిస్ట్ షహీర్ సైనాలాబ్దిన్ పాక్ బ్యాటర్‌కు చికిత్సను చేశాడు. మిడియోర్ హాస్పిటల్‌లో బ్యాటర్ రిజ్వాన్ రెండు రోజుల పాటు ఐసీయూ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అయితే రిజ్వాన్ కోలుకున్న తీరు పట్ల డాక్టర్ షహీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
 
ముజే కేల్నా హై.. టీమ్ కే సాత్ రహెనా హై అంటూ రిజ్వాన్ చికిత్స సమయంలో డాక్టర్లకు చెప్పాడట. ఆసీస్‌తో మ్యాచ్‌లో విరోచిత ఇన్నింగ్స్ ఆడిన రిజ్వన్ 52 బంతుల్లో 67 రన్స్ చేశాడు. అయినా ఆ మ్యాచ్‌లో పాక్ ఓడిన విషయం తెలిసిందే. నాకౌట్ మ్యాచ్‌ను ఆడాలని రిజ్వాన్‌కు ఉందని, చాలా నమ్మకంతో ఉన్నాడని, అతను కోలుకున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని డాక్టర్ షహీర్ తెలిపాడు.
 
ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు రిజ్వాన్ తీవ్రమైన జ్వరంతో ఇబ్బందిపడ్డాడు. దగ్గు, ఛాతి నొప్పి ఉందన్నాడు. హాస్పిటల్‌లో చేరడానికి 3 రోజుల ముందు రిజ్వాన్ ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. మొదట పాక్ జట్టు మెడికల్ టీమ్ అతనికి ప్రథమ చికిత్స చేసింది. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన సమయంలో అతనికి 10-10 నొప్పి ఉందని డాక్టర్లు చెప్పారు. లారింజియల్ ఇన్‌ఫెక్షన్ వల్ల ఈసోఫాగల్ స్పాజమ్ వచ్చిందని, దాంతో ఊపిరితిత్తులు కూడా బిగిసిపోయినట్లు డాక్టర్ షహీర్ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

తర్వాతి కథనం
Show comments