Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏదో ఒత్తిడి నాలుగు మాటలనేశా.. క్షమించండి.. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సొంతగడ్డపై జరిగిన క్రికెట్ సిరీస్ పలు వివాదాలకు దారి తీసింది. ఇరు జట్ల క్రికెటర్లు మైదానంలో నువ్వానేనా అన్నట్లు.. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాదు.. మాటల తూటాలు కూడా మైదానంలోనే

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (17:19 IST)
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సొంతగడ్డపై జరిగిన క్రికెట్ సిరీస్ పలు వివాదాలకు దారి తీసింది. ఇరు జట్ల క్రికెటర్లు మైదానంలో నువ్వానేనా అన్నట్లు.. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాదు.. మాటల తూటాలు కూడా మైదానంలోనే పేల్చుకున్నారు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు సిరీస్‌ హోరాహోరీగా ముగిసింది. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది.
 
బెంగళూరు టెస్టులో ఆసీస్‌ ఆటగాడు స్మిత్‌ ఔటైన సమయంలో సమీక్షలో సాయం కోసం డ్రెస్సింగ్‌ రూమ్‌ను ఆశ్రయించాడు. అప్పటికే అనేక సార్లు డ్రస్సింగ్ రూమ్ సాయం కోసం ఆసీస్ క్రికెటర్లు ఆశ్రయిస్తున్నట్లు పసిగట్టిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఆపై స్మిత్ కూడా తాను చేసిన తప్పును అంగీకరించాడు. ఈ వివాదం అంతటితో ముగిసినా.. చివరి టెస్టులో కూడా వేడ్‌-జడేజా మధ్య మాటల యుద్ధం జరిగింది.
 
ఈ నేపథ్యంలో సిరీస్‌లో చివరి టెస్టు ముగిసిన అనంతరం ఆసీస్‌ సారథి స్మిత్‌ మాట్లాడుతూ... సిరీస్‌ మధ్యలో తీవ్ర ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు అనుకోకుండా తన నోట మాటలు పేలాయని.. సారీ అని చెప్పాడు. ఆటగాడిగా, సారథిగా... మ్యాచ్‌, సిరీస్‌లో విజయం సాధించాలనే కోరుకుంటాను. ఆ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవ్వడంతో నా నుంచి కొన్ని మాటలు అనుకోకుండా దొర్లాయి. 
 
అంతేకాని ఎవర్నీ ఉద్దేశించి అనలేదు. ఏ ఒక్కరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఆటలో ఇవన్నీ మామూలేనని అందరూ భావించాలని స్మిత్ చెప్పుకొచ్చాడు. భారత్‌తో గొప్ప సిరీస్ ఆడినందుకు హ్యాపీగా ఉందని... రెండో ఇన్నింగ్స్‌లో ఉమేశ్‌ యాదవ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని అన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

ISRO : నమ్మశక్యం కాని డీ-డాకింగ్‌ సాధించిన SpaDeX ఉపగ్రహాలు.. ఇస్రో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

తర్వాతి కథనం
Show comments