Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాకు ముందుంది ముసళ్ళ పండుగ

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (15:59 IST)
టీమిండియాకు ముందుంది ముసళ్ల పండుగ అంటున్నారు క్రీడా పండితులు. ఎందుకంటే.. ఆస్ట్రేలియా జట్టు ఇటీవల భారత్‌లో పర్యటించి.. ట్వంటీ-20, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టుతోనే టీమిండియాకు గట్టి పోటీనే కాదు.. ప్రమాదం కూడా పొంచివుందని క్రీడా పండితులు చెప్తున్నారు.


ఇంతకీ విషయం ఏమిటంటే..? బాల్ టాంపరింగ్ వ్యవహారంలో ఏడాదికి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ త్వరలో ఇంగ్లండ్ గడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచ కప్ పోటీలకు అందుబాటులో వుంటారని తెలుస్తోంది. ఈ మేరకు వీరికి వన్డే ప్రపంచ కప్‌లో ఆడే ఆస్ట్రేలియా జట్టులో స్థానం దక్కుతుందని మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ షేర్ వార్న్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
గత ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు పోటీల్లో ఆస్ట్రేలియా జట్టు క్రికెటర్లు స్మిత్, వార్నర్‌లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన వ్యవహారంలో ఏడాది  నిషేధానికి గురయ్యారు. ఈ నిషేధ కాలం మార్చి చివరికల్లా పూర్తి కానుంది. దీంతో స్మిత్ వార్నర్‌లు వచ్చే 22వ తేదీ ప్రారంభం కానున్న ఐపీఎల్ ద్వారా క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. 
 
మరోవైపు ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ పోటీల్లోనే స్మిత్, వార్నర్‌లు క్రీజులోకి దిగుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ద్వారా స్మిత్, వార్నర్‌ బరిలోకి దిగితే బాగుంటుందని ఆస్ట్రేలియా సెలక్టర్లు భావిస్తున్నారు. ఫలితంగా స్మిత్ రాజస్థాన్ రాయల్స్ తరపున, డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతారని తెలుస్తోంది. 
 
దీనిపై ఆస్ట్రేలియా మాజీ స్టార్ క్రికెటర్ షేన్ వార్న్ మాట్లాడుతూ..  ప్రపంచ కప్ పోటీల్లో జట్టును స్మిత్, వార్నర్‌లు సమర్థవంతంగా నిర్వహిస్తారని భావిస్తున్నట్లు తెలిపాడు. కాగా స్మిత్, వార్నర్‌లు ఆస్ట్రేలియా జట్టు తరపున బరిలోకి దిగితే ఇక భారత్‌కు ఇక్కట్లు తప్పవని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా వీరు సింహస్వప్నంగా మారుతారని.. ఫలితంగా వరల్డ్ కప్ పోటీల్లో కోహ్లీ సేనకు చుక్కలు కనిపిస్తాయని క్రీడా పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments