ఐపీఎల్ 2025 : సన్ రైజర్స్‌కు ఓటమి నంబర్ 6

ఠాగూర్
గురువారం, 24 ఏప్రియల్ 2025 (11:20 IST)
ఐపీఎల్ 2025 సీజన్ పోటీల్లో భాగంగా, బుధవారం హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ మరోమారు ఓడిపోయింది. ఇది ఆ జట్టుకు ఆరో ఓటమి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. సన్ రైజర్స్ నిర్ణయించిన 144 పరుగుల విజయలక్ష్యాన్ని 15.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇందులో రోహిత్ శర్మ (70), సూర్య కుమార్ యాదవ్ (40) చొప్పున పరుగులు చేశాడు. 
 
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ముంబై బౌలర్ల బాధ్యతాయుత బౌలింగ్ రైజర్స్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడ్డారు. ఫలితంగా ముంబై ఇండియన్స్ ముందు ఓ మోస్తారు లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగారు. సన్ రైజర్స్‌కు టోర్నీలో ఇది ఆరో పరాజయం. దీంతో ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నది పాత సామెత... ఇపుడు అంతా రివర్స్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments