Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టరుగా షోయబ్ అక్తర్!!

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (17:03 IST)
పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టరుగా షోయబ్ అక్తర్ నియమితులుకానున్నారు. ఆయన నియామకం దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)తో చర్చించినట్లు అక్తర్‌ ధృవీకరించాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌ ప్రధాన కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌గా ఆదేశ మాజీ క్రికెటర్‌ మిస్బావుల్‌ హక్‌ కొనసాగుతున్నాడు.
 
ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పాక్‌ పేలవ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్రంగా విమర్శలు రావడంతో మిస్బాను కేవలం హెడ్‌ కోచ్‌గానే కొనసాగించి, చీఫ్‌ సెలక్టర్‌ పదవి నుంచి తప్పించాలని పీసీబీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆ పదవికి అక్తర్‌ను పరిశీలిస్తున్నారు. భారత క్రికెట్‌లో మాదిరిగానే స్వదేశీ కోచ్‌లు, కోచింగ్‌ సహాయ సిబ్బందిని పాక్‌ నియమించుకున్నది. 
 
'నేను దీన్ని తిరస్కరించలేను. అవును, బోర్డుతో చర్చలు జరిపాను. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డులో ప్రధాన పాత్ర పోషించడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. అయితే, ఇప్పటివరకు ఏమీ నిర్ణయించలేదు. ప్రస్తుతం నేను మంచి జీవితాన్ని గడుపుతున్నా. బాగానే స్థిరపడ్డాను. 
 
ఇలాంటి ప్రశాంత జీవితాన్ని విడిచి పీసీబీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇతరులకు సలహా ఇవ్వడానికి నేను భయపడను. అవకాశం వస్తే ఏదైనా చేయడానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తాను' అని క్రికెట్‌ బాజ్‌ నిర్వహించిన యూట్యూబ్‌ షోలో అక్తర్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments