Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో షేన్ వార్న్ కన్నుమూత, భారతదేశంలో మీ స్థానం స్పెషల్ అన్న సచిన్

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (21:47 IST)
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంతో క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా షేన్ వార్న్ నివాళులర్పించారు. సచిన్ టెండూల్కర్ ట్విట్టర్లో స్పందిస్తూ... వార్న్ మిమ్మల్ని మిస్ అయ్యాము.


మైదానంలో కానీ గ్రౌండ్ వెలుపల మీతో ఎప్పుడూ సంతోషంగా లేని క్షణం లేదు. మా ఆన్ ఫీల్డ్ డ్యూయెల్స్- ఆఫ్ ఫీల్డ్ హేపినెస్ ఎల్లప్పుడూ ఎంతో విలువైనది. మీరు ఎల్లప్పుడూ భారతదేశానికి ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు. భారతీయుల గుండెల్లో మీకు ప్రత్యేక స్థానం వుంటుంది అని తన ఆవేదన వ్యక్తం చేసారు.

 
లారా ట్వీట్ చేస్తూ... నాకు ప్రస్తుతానికి మాటలు లేవు. ఈ పరిస్థితిని ఎలా జీర్ణించుకోవాలో నాకు తెలియదు. నా స్నేహితుడు వెళ్ళిపోయాడు. మేము ఆల్ టైమ్ గొప్ప క్రీడాకారులలో ఒకరిని కోల్పోయాము. ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను.”
 
 
షేన్ వార్న్ ఆల్-టైమ్ అత్యుత్తమ బౌలర్లలో ఒకరనీ, ఆస్ట్రేలియన్ లెగ్గీ ఆల్-టైమ్ గ్రేట్ బ్యాట్సమన్లకు చుక్కలు చూపించగల దిట్ట. వార్న్ 708 టెస్ట్ మ్యాచ్ వికెట్లతో ఆల్ టైమ్ అత్యుత్తమ లెగ్ స్పిన్నర్.

 
వన్డేల్లో 293 వికెట్లు కూడా తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రేలియా తరపున 300 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఆస్ట్రేలియా దిగ్గజ క్రీడాకారుడు షేన్ మరణవార్త పట్ల క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments