Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిథాలీ రాజ్‌ను ప్రశంసించిన సానియా మీర్జా.. చంపేశావ్ పో.. అంటూ.. ట్వీట్

పాకిస్థాన్ విలేకరికి టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ దిమ్మదిరిగే యాన్సరిచ్చిన సంగతి తెలిసిందే. నేటి నుంచి (జూన్ 24) నుంచి మహిళల వన్డే ప్రపంచకప్-2017 ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ ఆతిథ్య ఇ

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (10:22 IST)
పాకిస్థాన్ విలేకరికి టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ దిమ్మదిరిగే యాన్సరిచ్చిన సంగతి తెలిసిందే. నేటి నుంచి (జూన్ 24) నుంచి మహిళల వన్డే ప్రపంచకప్-2017 ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లండ్-భారత్ మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల కెప్టెన్లకు నిర్వాహకులు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనంతరం పాకిస్థాన్ విలేకరి ఒకరు మిథాలీని ప్రశ్నించబోయి షాక్ తిన్నాడు.
 
భారత్, పాక్ జట్లలో మీ అభిమాన క్రికెట్ ఆటగాడు ఎవరు? అని ప్రశ్నించాడు. అతడి ప్రశ్నపై మిథాలీ ఒక్కసారిగా ఫైర్ అయ్యింది. ‘ఎవరైనా ఆటగాడిని మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరు అని మీరు అడగగలరా? అని ప్రశ్నించింది. ‘ఎవరైనా ప్రశ్న అడిగేటప్పుడు మీ అభిమాన క్రికెటర్ ఎవరు? అని అడుగుతారే తప్ప, మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరు? అని అడుగుతారా? అంటూ ప్రశ్నించడంతో విలేకరి అవాక్కయ్యాడు.  
 
ఈ నేపథ్యంలో పాక్ విలేకరికి దిమ్మ దిరిగే ప్రశ్నేసిన మిథాలీ రాజ్‌ను ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభినందించింది. పాకిస్థాన్ విలేకరికి మంచి సమాధానంతో 'చంపేశావ్ పో' అంటూ ప్రశంసించింది. కాగా, వీరిద్దరూ హైదరాబాదుకు చెందిన క్రీడాకారిణులు కావడం విశేషం. సానియాతోపాటు పలువురు మాజీ క్రీడాకారులు కూడా మిథాలిపై ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్లో మిథాలీ ప్రశ్నకు విభిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments