Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిటిల్ట్ మాస్టర్‌తో లిటిల్ ఫ్యాన్.. ఆ తేదీని క్యాలెండర్‌లో మార్కు లేదా సేవ్ చేసుకోండి..

టీమిండియా స్టార్ ప్లేయర్ హర్భజన్ సింగ్ కుమార్తె హినయ హీర్‌తో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆడుకున్నాడు. ఆ ఫోటోలను సచిన్ ట్విట్టర్‌లో పెట్టి తన సంతోషాన్ని పంచుకోగా దాన్ని హర్భజన్‌, అతని భార్య రీట్

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (18:02 IST)
టీమిండియా స్టార్ ప్లేయర్ హర్భజన్ సింగ్ కుమార్తె హినయ హీర్‌తో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆడుకున్నాడు. ఆ ఫోటోలను సచిన్ ట్విట్టర్‌లో పెట్టి తన సంతోషాన్ని పంచుకోగా దాన్ని హర్భజన్‌, అతని భార్య రీట్వీట్ చేశారు. సచిన్‌కు భజ్జీ ధన్యవాదాలు తెలపగా, అతని భార్య గీతా బస్రా స్పందిస్తూ.. లిటిల్ మాస్టర్‌తో లిటిల్ ఫ్యాన్ అంటూ కామెంట్ చేసింది. భజ్జీ కుమార్తెను ఎత్తుకుని మాస్టర్ సంతోషంగా గడిపాడు. 
 
ఇదిలా ఉంటే.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్వయంగా నటించిన బయోపిక్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. సచిన్ టెండూల్కర్ నటించిన 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమాను త్వరలోనే వెండి తెరపై చూడొచ్చు. తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' విడుదల తేదీని మాస్టర్‌ ట్విటర్‌లో సోమవారం ప్రకటించాడు. మే 26వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఆ డేట్‌ను క్యాలెండర్‌లో మార్కు చేసుకోండి లేకపోతే సేవ్ చేసుకోండని సచిన్ ట్వీట్ చేశాడు. 
 
ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్‌ ఎర్సికిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సచిన్‌ టెండూల్కర్ తన పాత్రను తానే పోషించాడు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి మొదటి పోస్టర్‌ను ఏప్రిల్ 2016లో విడుదల చేశారు. ఈ చిత్రంలో సచిన్ యువకుడిగా ఉన్న సన్నివేశాల్లో అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ నటించనుండటం మరో విశేషం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments