Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ గ్రామంలో అధికారులు: ఇక్కడ శుభ్రం చేయరా? స్థానికులకు ప్రశ్న

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2015 (14:34 IST)
క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ గ్రామంలో అధికారులు పర్యటించారు. ఈ నెల 23న జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు కోసం ఆదర్శ గ్రామాల అభివృద్ధి చిత్ర సమర్పణ జరుగనుంది. ఇందులో భాగంగా సచిన్ దత్తత తీసుకున్న గ్రామాన్ని టెండూల్కర్ సిబ్బంది, అధికారులు నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పుట్టంరాజువారి కండ్రిగలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పర్యవేక్షించారు. 
 
ఈ సందర్భంగా అధికారులు అభివృద్ధి పనులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందస్తు సమాచారం లేకుండా సచిన్ సిబ్బంది బృందం దిగబడ్డారు. దీంతో స్థానికులు తలపట్టుకున్నారు. వచ్చీరాగానే స్థానికులను ప్రశ్నలు మీద ప్రశ్నలేశారు. శుభ్రత లేదంటూ మండిపడ్డారు. గ్రామంలోని సిమెంట్ దారులను చూసి ఆశ్చర్యపోయిన అధికారులు అపరిశుభ్రంగా ఉండటంతో ఇక్కడ శుభ్రం చేయరా? అంటూ స్థానికులను ప్రశ్నించారు. 
 
ఇంకా గ్రామంలో జరుగుతున్న నిర్మాణ పనులపై ఆరా తీశారు. కాగా సచిన్ ఎంపీ నిధులతో ఈ గ్రామంలో క్రీడా మైదానం, అంగన్ వాడీ భవనం, భోజనశాల, గ్రామచెరువు ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వాటిని పరిశీలించిన అధికారులు ఫోటోలు తీసుకున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments