Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ బ్యాట్ పట్టనున్న సచిన్ టెండూల్కర్.. సెహ్వాగ్ కూడా రంగంలోకి?

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (10:25 IST)
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఫ్యాన్సుకు శుభవార్త. సచిన్ టెండూల్కర్ మళ్లీ క్రికెట్ ఆడనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2013 నవంబరు 16న వీడ్కోలు పలికిన క్రికెట్ దిగ్గజం మరోసారి ట్వంటీ-20 లీగ్‌లో మెరవనున్నాడు. బ్రియాన్ లారాతో కలిసి వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో బ్యాట్ పట్టనున్నాడు.. మాస్టర్ బ్లాస్టర్.
 
ఈ టోర్నమెంట్ 2020 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 16వరకూ భారత దేశ వ్యాప్తంగా జరగనుంది. సునీల్ గవాస్కర్‌కు చెందిన పీఎంజీ, మహారాష్ట్ర రోడ్డు భద్రత విభాగం ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నాయి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. 
 
ఈ టోర్నీలో ఐదు దేశాలకు చెందిన రిటైర్డ్ క్రికెటర్లు ఆడనున్నారు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ప్లేయర్లు చాలా కాలం తర్వాత తిరిగి బ్యాట్ పట్టుకోనున్నారు. టెండూల్కర్, లారా వంటి దిగ్గజాలతో పాటు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆస్ట్రేలియా బ్రెట్ లీ, శ్రీలంక తిలకరత్నె దిల్‌షాన్, దక్షిణాఫ్రికా జాంటీ రోడ్స్ ఆడుతున్నారు. మొత్తం 110మంది ప్లేయర్లు టోర్నీలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనీ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే సెలెబ్రిటీలకు రెండేళ్ల జైలు ఖాయం

ఇదేదో పేర్ని నాని చెప్పినట్లు కనబడుతోందే (video)

DK Aruna: తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా: డీకే అరుణ

Hyderabad: ఈ-ఆటో పార్కింగ్ పొరపాటు.. ఎనిమిదేళ్ల బాలుడు మృతి.. ఎలా?

ఆటోలో డిప్యూటీ సీఎం పవన్: మీతో ఇలా పక్కన కూర్చుని ప్రయాణం అస్సలు ఊహించలేదు సార్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

తర్వాతి కథనం
Show comments