Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ వెన్ను విరించిన ఆర్సీబీ బౌలర్లు... గ్రాండ్ విక్టరీ

Webdunia
ఆదివారం, 14 మే 2023 (20:04 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఫలితంగా 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు కేవలం 59 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 10.3 ఓవర్లలోనే అన్ని వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు జైస్వాల్, జోస్ బట్లర్‌లు డకౌట్ కాగా, కెప్టెన్ సంజూ శాంసన్, 4, జో రూట్ 10 పరుగులు చేశారు. 
 
షిమ్రోన్ హెట్మెయర్ ఒక్కడే ధాటిగా ఆడి 19 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. హెట్మెయర్ ఔట్ అయ్యాక రాజస్థాన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. దేవక్కల్ పడిక్కల్ 4, జురెల్ 1, అశ్విన్ 0, జంపా 2, ఆసిఫ్ సున్నా పరుగులు చేసి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. బెంగుళూరు బౌలర్లలో సిరాజ్ 1, వేన్ పార్నెల్ 3, బేస్వెల్ 2, కర్ణ్ శర్మ 2, మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ చొప్పున తీశారు. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులుచేసింది. కోహ్లీ 18, ప్లెసిస్ 55, మ్యాక్స్‌వెల్ 54, అలుజ్ రావత్ 29 చొప్పున పరుగులు చేశారు. ఆర్ఆర్ బౌలర్లలో శర్మ 1, జంపా 2, అసిఫ్ 2 చొప్పున వికెట్లు నేలకూల్చారు. ఫలితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు 112 పరుగుల భారీ తేడాతో గెలవడమే కాకుండా రన్ రేట్ బాగా మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం ఆర్బీసీ రన్ రేట్ 0.166గా ఉంది. దీంతో ఆర్బీబీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. ఆర్ఆర్ జట్టు ఐదు నుంచి ఆరో స్థానానికి పడిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

తర్వాతి కథనం
Show comments