Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపక్ చాహర్‌‌కు సెల్యూట్.. రోహిత్ శర్మ వీడియో వైరల్

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (11:04 IST)
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ-20లో రోహిత్ శర్మ అదరగొట్టాడు. కోల్‌కతా టీ20లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ మరోసారి ఘాటుగా మాట్లాడింది. ఈ సిరీస్‌లో రోహిత్ వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ 31 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌ చివర్లో వచ్చిన దీపక్ చాహర్ బ్యాటింగ్‌ ఫిదా అయ్యి సలాం చేయడం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
 
మూడో టీ-20లో రోహిత్ సూపర్ బ్యాటింగ్‌కు తోడు..  దీపక్ చాహర్ ఇన్నింగ్స్‌తో భారత్ భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్లో దీపక్ చాహర్ 19 పరుగులు చేశాడు. దీపక్ చాహర్ గంటకు 150 కి.మీ. వేగంతో విసిరిన ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నేని చిత్తు చేశాడు. మిల్నే వేసిన ఓవర్లో దీపక్ చాహర్ 2 ఫోర్లు, సుదీర్ఘ సిక్సర్ బాదాడు.
 
ఆడమ్ మిల్నే వేసిన తొలి రెండు బంతుల్లో దీపక్ చాహర్ 2 ఫోర్లు బాదినా.. నాలుగో బంతికి ఈ ఆటగాడు 95 మీటర్ల సిక్సర్ కొట్టిన తీరు అద్భుతం. మిల్నే వేసిన షార్ట్ బాల్‌పై చాహర్ ఫ్లాట్ బ్యాట్‌తో షాట్ ఆడగా, ఆ బంతి సిక్సర్‌గా మారింది. ఈ సిక్స్ 95 మీటర్ల పొడవు వెళ్లింది. దీనిని చూసిన రోహిత్ శర్మ కూడా ఆశ్చర్యపోయాడు. దీపక్ చాహర్‌కు భారత కెప్టెన్‌కు సెల్యూట్ చేస్తూ కనిపించాడు. రోహిత్ శర్మకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

తర్వాతి కథనం
Show comments