Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ క్లబ్‌లో మజాయే వేరు... ఇషాన్ కిషన్ : రోహిత్ శర్మ

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (17:43 IST)
చిట్టగాంగ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌‍లో డబుల్ సెంచరీ చేసిన భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్‌కు సీనియర్ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్లు సైతం ఇషాన్‌ ప్రతిభను కొనియాడుతూ, సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. 
 
ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నారు. ద్విశతకం సాధించిన ఇషాన్ కిషన్‌ గురించి ప్రత్యేకంగా ఒక నోట్ రాశాడు. "ఈ క్లబ్‌లో మజాయే వేరు, ఇషాన్ కిషన్" అంటూ ఒకే ఒక ముక్కలో రాసుకొచ్చాడు. ఈ నోట్ ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలోకి ఇషాన్‌కు స్వాగతం పలికాడు. 
 
కాగా, గాయం కారణంగా మూడో వన్డే మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. దీంతో ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఇషాన్ కిషన్‌కు దక్కింది.  ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్.. కేవలం 126 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో డబుల్ సెంచరీ సాధించాడు. వన్డేలోనే తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచిన ఘనతను దక్కించుకున్నాడు. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఏకైక ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 
 
భారత్ తరపున డబుల్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఇషాన్ కంటే రోహిత్ మూడుసార్లు డబుల్ సెంచరీలు చేయగా, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌లు డబుల్ సెంచరీలు సాధించారు. మొత్తంగా వన్డేల్లో డబుల్స్ సెంచరీ చేసిన ఏడో ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు కూడా ఇషానే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు.. రేవంత్ రెడ్డి

అసెంబ్లీకి హాజరయ్యే ధైర్యం లేకుంటే జగన్ రాజీనామా చేయాలి: షర్మిల

పిజ్జా ఆర్డర్ చేస్తే.. అందులో పురుగులు కనిపించాయ్.. వీడియో

బాలినేనికి కేబినెట్‌లో స్థానం.. చంద్రబాబుకు తలనొప్పి.. పవన్ పట్టుబడితే?

సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు వున్నాయో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

తర్వాతి కథనం
Show comments