Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయం నుంచి కోలుకున్న బుమ్రా - ముంబై ఇండియన్స్‌లో కొత్త జోష్ (Video)

ఠాగూర్
ఆదివారం, 6 ఏప్రియల్ 2025 (17:37 IST)
ముంబై ఇండియన్స్‌ అభిమానులకు శుభవార్త. ఆ జట్టు పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని జట్టులో చేరాడు. ఈ మేరకు ఆ జట్టు మేనేజ్మెంట్ అధికారికంగా వెల్లడించింది. ఈ వార్త ముంబై ఇండియన్స్‌కు నిజంగానే శుభవార్త వంటింది. ఐపీఎల్ సీజన్‌‍లో సరైన స్ట్రైక్ బౌలర్ లేక ఆ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లు ఆడితే అందులో మూడింటిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో బుమ్రా తిరిగివచ్చాడన్న వార్త అభిమానులను ఆనందోత్సవాల్లో ముంచెత్తుతోంది. 
 
ఐదు సార్లు చాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఓ వీడియోను విడుదల చేస్తూ.. గర్జించడానికి సిద్ధంగా ఉంది అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. బుమ్రా తిరిగి రావడం ముంబై ఇండియన్స్ ఎంతో ఊరటనిచ్చే అంశం. బెంగుళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుమ్రా పునరాగమనానికి మార్గం సుగమమైంది. బుమ్రా రాకతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం మరింత బలోపేతం కానుంది. 
 
బుమ్రా రాకతో జట్టుకు కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు. బుమ్రా తన ఖచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థులను కట్టడి చేయగలడని, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటుూ జట్టుకు విజయాలు అందించగల సత్తా బుమ్రాకు ఉందనే మంచి పేరుంది. ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లో రేపు వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఎలాంటి ప్రభావం చూపిస్తాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

తర్వాతి కథనం
Show comments