Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందం కంటే... ఉద్విగ్నంగా ఉంది : క్రికెటర్ అశ్విన్

ఠాగూర్
బుధవారం, 6 మార్చి 2024 (11:36 IST)
తాను వందే టెస్ట్ ఆడుతున్నాననే ఆనందం కంటే... తనకు ఉద్విగ్నంగా అధికంగా ఉందని భారత లెగ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అన్నారు. భారత్, ఇంగ్లండ్ జట్ల ధర్మాశాల వేదికగా ఐదో టెస్ట్ మ్యాచ్ జగనుంది. ఇది అశ్విన్‌కు వందో టెస్ట్ మ్యాచ్. టెస్టు ఫార్మాట్ క్రికెట్లో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు' గెలుచుకున్న భారతీయ క్రికెటర్‌గా ఉన్న అశ్విన్.. అంతర్జాతీయ ఆటగాళ్ల జాబితాలోనూ అగ్రస్థానం దిశగా చేరువవుతున్నాడు. 
 
ఇప్పటివరకు అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు'లు గెలుచుకున్న ఆటగాడిగా శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 11 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల'తో ముత్తయ్య అగ్రస్థానంలో ఉండగా 10 అవార్డులతో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. అశ్విన్ మరో అవార్డు అందుకుంటే మురళీధరన్‍తో సమంగా నిలవనున్నాడు.
 
ఇక టెస్ట్ ఫార్మాట్ క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న టాప్-5 ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ మూడో స్థానంలో నిలిచాడు. అతడు మొత్తం 9 టెస్టుల సిరీస్‌లలో ఈ అవార్డు దక్కించుకున్నాడు. 
 
పాకిస్థాన్ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ మొత్తం 8 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులతో నాలుగో స్థానంలో నిలిచాడు. 28 సిరీస్‌లో ఈ అవార్డులను దక్కించుకోవడం విశేషం. ఇక న్యూజిలాండ్‌కు చెందిన సర్ రిచర్డ్ హ్యాడ్లీ 5వ స్థానంలో ఉన్నాడు. మొత్తం 33 టెస్టు సిరీస్‌లు ఆడిన రిచర్డ్ హ్యాడ్లీ 8 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కించుకున్నాడు.
 
కాగా రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ భారతీయ క్రికెటర్ గా అశ్విన్ నిలిచిన విషయం తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

తర్వాతి కథనం
Show comments