Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ దిగ్గజాలను వెనక్కి నెట్టిన అశ్విన్... అరుదైన రికార్డు సొంతం

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లను వెనక్కినెట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తుమ గణాంకాలు నమోదు చేయడం ద్వారా అరుదైన రికార్డును తన పేరిట లిఖి

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (18:30 IST)
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లను వెనక్కినెట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తుమ గణాంకాలు నమోదు చేయడం ద్వారా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గిజ ఆటగాళ్లైన సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్‌లను కూడా వెనక్కి నెట్టేశాడు. అంతేగాక మొదటి ఇండియన్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 
 
తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అటు బాల్‌తో, ఇటు బ్యాట్‌తో రాణించిన అశ్విన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' దక్కిన సంగతి తెలిసిందే. అయితే అది అశ్విన్‌కు తన టెస్ట్ కెరీర్‌లో 6వది. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు అశ్విన్ మొత్తం 6 సార్లు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులను స్వీకరించాడు. అయితే ఈఫీట్ సాధించినందుకు అశ్విన్ ఆడిన టెస్ట్ మ్యాచ్‌లు కేవలం 36 మాత్రమే. 
 
అంతకుముందు వరకు సచిన్, సెహ్వాగ్‌లు సంయుక్తంగా ఐదు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌' అవార్డులు పొంది సమానంగా మొదటి స్థానంలో ఉండేవారు. టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్ తరపున ఎక్కువ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు పొందిన వారిలో అశ్విన్‌ మొదటి ప్లేస్‌లో ఉండగా, సచిన్, సెహ్వాగ్‌లు రెండో స్థానంలో ఉన్నారు. అయితే సచిన్ ఈ ఘనతను 74 సిరీస్‌లలో అందుకోగా, సెహ్వాగ్ 39 సిరీస్‌లలో అందుకున్నాడు. అదే అశ్విన్ అయితే 13 సిరీస్‌లలోనే ఈ ఘనత సాధించి అరుదైన రికార్డును అందుకున్నాడు. 

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments