Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెమీ ఫైనల్ మ్యాచ్ : వాంఖేడ్ స్టేడియంలో అతిరథ మహారథులు

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (16:56 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు స్టేడియంకు తరలివచ్చారు. 
 
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అతిథుల జాబితాలో అనేక మంది ఉన్నారు. వీవీఐపీ లాంజ్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, ఇంగ్లండ్ మాజీ క్రికెట్ దిగ్గజం డేవిడ్ బెక్ హామ్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ తదితరులు కనిపించనున్నారు.
 
అలాగే, మ్యాచ్‌ను చూసేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ మంగళవారం రాత్రే చెన్నై నుంచి ముంబై చేరుకున్నారు. ముంబైకి బయల్దేరే ముందు చెన్నైలో రజినీకాంత్ మాట్లాడుతూ, మ్యాచ్ చూసేందుకు ముంబై వెళ్తున్నానని చెప్పారు. 
 
మరోవైపు బెక్ హామ్ యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉన్నారు. మహిళలు, బాలకల సాధికారత, లింగ సమానత్వం కోసం యూనిసెఫ్, ఐసీసీ కలిసి పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు బెక్ హామ్ గెస్టుగా వచ్చారు. సచిన్ టెండూల్కర్‌తో కలిసి స్టేడియంలో బెక్ హామ్ సందడి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments