Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్లకు గ్రహణం.. గాయపడిన మరో బెంగాల్ క్రికెటర్..!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (18:58 IST)
క్రికెటర్లకు గ్రహణం పట్టినట్టుంది. తమ క్రీడతో అభిమానులను అలరించే క్రికెటర్లు మృత్యువాతపడుతున్నారు. యువ క్రికెటర్ అంకిత్ కేసరి మరణవార్త మరువకముందే మరో క్రికెటర్ గాయపడిన వార్త వెలుగులోకి వచ్చింది. బెంగాల్ కే చెందిన రాహుల్ ఘోష్ అనే యువ క్రికెటర్ కు లీగ్ క్రికెట్ లో ఆడుతుండగా తలకు బలమైన గాయమైంది. 
 
రాహుల్ ఘోష్ మంగళవారం ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో, అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు చికిత్స అందుకున్న వైద్యులు మాట్లాడుతూ.. ఘోష్   తలకు ఎడమవైపున తీవ్రమైన గాయం ఏర్పడిందని తెలిపారు. 
 
సీటీ స్కాన్‌లో రక్తం గడ్డకట్టినట్టు తేలిందన్నారు. ప్రస్తుతం ఘోష్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయినప్పటికీ వారం రోజుల పాటు పరిశీలనలో ఉంచుకుని వైద్యం అందించాల్సి ఉందని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments