Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి పంజాబ్ విజయం - చెన్నైకు షాక్

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (20:12 IST)
ఐపీఎల్ 2023లో మరో ఉత్కంఠ భరితపోరు సాగింది. ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ లెవెన్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి మూడు పరుగులు కాల్సివుండగా, బ్యాటర్ రజా సమయస్ఫూర్తితో ఆడి ఫోర్ కొట్టడంతో పంజాబ్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయభేరీ మోగీంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ధోని సేన నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పంజాబ్‌ చివరి వరకూ పోరాడింది. ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సిన సమయంలో సికిందర్ రజా సమయస్ఫూర్తితో ఆడాడు. దీంతో విజయం పంజాబ్‌ ఖాతాలో పడింది. పంజాబ్‌ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్  (42, 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), లివింగ్ స్టోన్‌ (40, 24 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు), శిఖర్‌ ధావన్‌ (28, 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించారు. సామ్‌ కరన్‌ (29, 20 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌ ఫర్వాలేదనిపించాడు. 
 
కాగా, ఈ మ్యాచ్‌ను తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వీక్షించారు. సాధారణంగా తెల్ల చొక్కా, పంచెకట్టులో దర్శనమిచ్ ఆయన.. ఈ మ్యాచ్‌ కోసం క్యాజువల్ దుస్తుల్లో కనిపించారు. అలాగే, సొంతగడ్డపై సీఎస్కే 200 పరుగులు చేసినప్పటికీ ధోనీ సేన ఓడిపోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీ కీపింగ్ చేస్తున్న సమయంలో మోకాలి గాయంతో ఇబ్బందిపడినట్టు కనిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

తర్వాతి కథనం
Show comments