Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ నుంచి పెప్సీ అవుట్: పెప్సీ తప్పుకోవడం పెద్ద విషయం కాదట!

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (13:31 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి స్పాన్సర్ పెప్సీ తప్పుకుంది. గడిచిన ఐదేళ్లుగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పెప్సీ.. తదుపరి సీజన్‌కు తాము స్పాన్సర్‌గా వ్యవహరించలేమని స్పష్టం చేసింది. పెప్సీ కాంట్రాక్టు 2017తో ముగియనున్న నేపథ్యంలో.. రెండేళ్ల ముందే ఐపీఎల్ నుంచి తాము తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, విదేశాల్లో జరుగుతున్న పలు పోటీలకు స్పాన్సర్‌గా ఉన్నందునే ఐపీఎల్ వద్దని పెప్సీ భావిస్తున్నట్టు క్రికెట్ పండితులు అంటున్నారు. 
 
పెప్సీ నుంచి మరేదైనా సంస్థకు టైటిల్ స్పాన్సర్ హక్కులను బదిలీ చేస్తామని బీసీసీఐ పేర్కొంది. పెప్సీ తప్పుకోవడంతో మరో కంపెనీని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. కాగా, ఈ వార్తలపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. పెప్సీ స్పాన్సర్ నుంచి తప్పుకోవడం పెద్ద విషయం కాదన్నారు. ఈ వ్యవహారాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని శుక్లా వెల్లడించారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments