Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ బ్యాటింగ్.. బౌన్సర్లతో భయపెడుతున్న ఆస్ట్రేలియా బౌలర్లు!

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2015 (09:43 IST)
వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం ఆడిలైడ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు తమ బౌన్సర్లతో విరుచుకుపడుతున్నారు. దీంతో పాక్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోతున్నారు. 
 
ఐదు, ఆరో ఓవర్లలో వరుసగా పాక్ జట్టు ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు. జట్టు స్కోరు 20 పరుగులకు చేరగానే తొలి వికెట్ కోల్పోయిన పాక్, మరో నాలుగు పరుగులు చేసి రెండో వికెట్‌ను కోల్పోయింది. పాక్ స్టార్ బ్యాట్స్‌మన్‌గా వెలుగొందుతున్న సర్ఫరాజ్ అహ్మద్ (10) మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో షేన్ వాట్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే అహ్మద్ సెహజాద్ (5) కూడా జోస్ హ్యాజిల్ వుడ్ బౌలింగ్‌లో క్లార్క్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 
 
అలాగే, పాకిస్థాన్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌ పట్ల దేవుడు కరుణించాడు. హక్ బ్యాటింగ్ చేస్తుండగా, హజ్లీవుడ్ వేసిన 5వ ఓవర్ 3వ బంతి లెగ్ సైడ్ వెళ్తూ, మిస్బా ప్యాడ్‌ను ఆపై స్టంప్స్‌ను తాకుతూ వెళ్లింది. దీంతో స్టంప్స్, బెయిల్స్‌లో ఉన్న ఎల్ఈడీ లైట్లు కూడా వెలిగాయి. కానీ బెయిల్స్ మాత్రం కింద పడలేదు. అప్పటికే 2 వికెట్లు తీసి జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు ఒక్క క్షణం సంబరాలు చేసుకొని, ఆ పై విషయం తెలిసి సర్దుకున్నారు. మిస్బా కు లభించిన ఈ లైఫ్‌ను అతను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం పాకిస్థాన్ స్కోర్ 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు.
 
అంతకుముందు ఆస్ట్రేలియా నగరం ఆడిలైడ్ లోని ఓవల్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు ఆసీస్‌కు బౌలింగ్ అప్పగించింది. భారత్‌తో సెమీ ఫైనల్‌లో తలపడే జట్టును నిర్ధారించనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments