Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్విన్ సమయం ముగిసింది.. మాకు కుల్దీపే ముఖ్యం : రవిశాస్త్రి

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (17:50 IST)
భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కష్టకాలంలో ఉన్న సమయంలో ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించిన రవించంద్రన్ అశ్విన్‌ను ఉద్దేశించి ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. అదేసమయంలో యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 
 
ఇదే అంశంపై రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికలపై కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తమ మొదటి ఛాన్స్ అతనికే. ముఖ్యంగా టెస్టుల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఐదు వికెట్లు తీస్తున్నాడు. ఒకవేళ మాకు ఒకే స్పిన్నర్‌ని తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా అతనికే చోటు కల్పిస్తాం అని చెప్పారు. 
 
అంతేకాకుండా, సమయం ఎప్పటికీ ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుంది. ప్రస్తుతానికి కుల్దీప్ నంబవర్ వన్ బౌలర్. అతను సిడ్నీ టెస్టులో అద్భుత ప్రదర్శన చేశాడు. విదేశాల్ల మనకి స్పిన్ ఎంతో ముఖ్యం. కుల్దీప్ సిడ్నీలో బౌలింగ్ చేసిన తీరు చూస్తే జట్టులో అతని ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది అని శాస్త్రి చెప్పుకొచ్చాడు. 
 
కాగా, ఇటీవల ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో కుల్దీప్ యాదవ్ ఏకంగా ఐదు వికెట్లు తీసి కంగారుల వెన్ను విరిచిన విషయం తెల్సిందే. కుల్దీప్‌ను వెనుకేసుకొచ్చిన శాస్త్రి... రవిచంద్రన్ అశ్విన్‌ను తక్కువ చేసేలా మాట్లాడారు. అశ్విన్ ఒక స్పిన్ సంచలనం అయినప్పటికీ.. అశ్విన్ కంటే కుల్దీప్ మెరుగైన స్పిన్నర్ అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

తిరుమల బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారం.. పిల్లి చిక్కలేదు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

తర్వాతి కథనం
Show comments